AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉనికే కష్టం: పీకే సంచలన కామెంట్లు

తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఎక్సె ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న పీకే.. అటు ఏపీ ఎన్నికలపై ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటవి కాదని.. భారీ ఓటమి ఖాయమని చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాజకీయాలపై పీకే ఆసక్తికర కామెంట్లు చేశారు. అయితే.. తానే బీఆర్ఎస్ కార్యకర్తను అయ్యి ఉంటే.. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితిపై కచ్చితంగా ఆందోళన చెందేవాడినని చెప్పుకొచ్చారు పీకే. ఒకవేళ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి కష్టమేనని స్టేట్ మెంట్ ఇచ్చారు.

అయితే.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు మాత్రం జగన్ భారీ ఓటమి చవిచూస్తారని చెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. చదువుకున్న యువత ఉద్యోగాలు కోరుకుంటుందని.. ఉచితాలు కాదని పీకే అభిప్రాయపడ్డారు. కానీ.. జగన్ మాత్రం ఉపాధి అవకాశాల కల్పనపై కాకుండా.. కేవలం ఉచితాలపైనే దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. దీంతో.. జగన్ ఈసారి భారీ ఓటమిని కూడగట్టుకోనున్నారని చెప్పుకొచ్చారు.

ANN TOP 10