AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెజార్టీ స్థానాల్లో కొత్తవారికే అవకాశం.. ఆ దిశగా కేసీఆర్‌ కసరత్తు

పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తే చేస్తోంది బీఆర్ఎస్. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్తవారిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు జంప్ అయ్యారు. మరో ముగ్గురు ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారుతారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు 16 సీట్లలో మెజార్టీ స్థానాల్లో కొత్తవారికే అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారు గులాబీబాస్.

గత లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోకసభ స్థానాలను గెలుచుకుంది. అందులో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ నేతకానీ వెంకటేశ్ కాంగ్రెస్ లోకి, నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లారు. మరో ముగ్గురు ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతు కవిత కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులపై
ఆర్థికంగా బలంగా ఉండి పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలపై పార్టీ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు సుముఖంగా లేనన్న సంకేతాలను ఇస్తున్నారు. మల్కాజిగిరిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి టికెట్ రేస్ లో ఉన్నా తాజాగా పోటీలో ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులపై పార్టీ దృష్టిపెట్టింది బీఆర్ఎస్.

కడియం శ్రీహరి కూతురు పోటీ?
మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గాలి అనిల్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. వరంగల్ లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను రంగంలోకి దించే ఛాన్సుంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి సోదరుడి తనయుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆసీటులో కూడా కొత్త నేతను రంగంలోకి దించాలని పార్టీ భావిస్తోంది. దివంగత గాయకుడు సాయిచంద్ సతీమణి రజనీ లేదా విద్యాసంస్థల అధినేత రవికుమార్ మహబూబ్ నగర్ సీటు ఆశిస్తున్నారు.

ANN TOP 10