AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంగంలోకి దిగిన గులాబీ దళపతి.. ఎంపీలు పార్టీ వీడటంతో అలర్ట్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీని నేతలు వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. తాను ఉన్నాననే భరోసా ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. అందుకోసమే ఈ రోజు తెలంగాణ భవన్‌ కు వస్తున్నారు. ఇకపై రోజు తాను అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. పార్టీ నేతలు, శ్రేణులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అందుకోసం కేసీఆర్ రంగంలోకి దిగారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఓ వైపు ఇద్దరు ఎంపీల (MP) రాజీనామా, మరో ముగ్గురు ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్దం అని జోరుగా ప్రచారం.. ఇక లాభం లేదనుకొన్న గులాబీ దళపతి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌‌కు (Telangana Bhavan) వస్తున్నారు.

ఎంపీలు పార్టీ వీడటంతో అలర్ట్
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలను గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదని రాజకీయ పరిణామాల ద్వారా తెలుస్తోంది. పార్టీని సిట్టింగ్ ఎంపీలు వీడుతున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు బీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇద్దరు నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో బీబీ పాటిల్‌కు టికెట్ దక్కింది. నాగర్ కర్నూలులో రాములుకు బదులు అతని కుమారుడు భరత్‌కు టికెట్ కేటాయించారు. మరో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని.. రేపో, మాపో కమలం గూటికి చేరడం ఖాయం అని తెలుస్తోంది. కుమారుడి టికెట్ కోసం మాజీ మంత్రి ప్రయత్నించారని, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది.

ANN TOP 10