AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీరో బిల్ వచ్చేసింది .. అమల్లోకి గృహ జ్యోతి స్కీం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల్లో గృహ జ్యోతి పథకం కింద అందించే ఉచిత కరెంట్ ఇవ్వాలే అమల్లోకి వచ్చింది. గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు నేటి నుంచి జీరో విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌‌లో అవసరమైన మార్పులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్షన్లలోనూ నేటి నుంచి 200 లోపు యూనిట్లు వినియోగించుకునే లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జీరో బిల్లింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌‌లో అవసరమైన మార్పులు చేశారు. తెల్ల రేషన్‌ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

జీజేఎస్ సబ్సిడీ కింద జీరో బిల్లు

నేటి నుంచి నుంచి విద్యుత్ శాఖ అధికారులు బిల్స్ జారీ చేస్తున్న నేపథ్యంలో గృహ జ్యోతి పథకానికి అర్హులైన కొందరికి జీరో బిల్స్ వస్తున్నాయి. ఈ బిల్లుల్లో కరెంట్ వినియోగానికి సంబంధించి రిపోర్ట్ మొత్తం ఇస్తూనే బిల్ అమౌంట్ కూడా వస్తోంది. అయితే జీజేఎస్ సబ్సిడీ కింద ఆ మొత్తం జీర్ప్ అయినట్లు చూపెడుతోంది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడితేనే వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తించనుండగా.. ఒకవేళ 201 యూనిట్స్ దాటితే ఆ మొత్తానికి కరెంట్ బిల్ వేయడం జరుగుతుందన్నారు. దానికొచ్చే మొత్తం బిల్లు కట్టాల్సి ఉంటుంది. గతంలో కూడా కరెంట్ బిల్లులు బకాయి ఉన్నా కూడా వాటికి ఈ పథకం వర్తించదన్నారు. వాటిని పూర్తిగా కడితేనే ఈ గృహ జ్యోతి పథకానికి అర్హులుగా ఉంటారు. జీరో బిల్లులు పొందడం విద్యుత్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి..

రాష్ట్ర వ్యాప్తంగా సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్‌ బిల్లులతో రేషన్‌ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు అధికారులు ఈ పథకం వర్తింపజేయనున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడకం ఉన్న అందరికీ మార్చి నెల జీరో బిల్లు వస్తుంది. విద్యుత్‌ అధికారులు ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారు. అన్ని సెక్షన్లలో మార్చి 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడి, తెల్లరేషన్‌ కార్డు ఉండి కూడా ఏదైనా టెక్నికల్ లోపంతో జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఇలా అప్లై చేయొచ్చని అధికారులు సూచించారు. మున్సిపల్, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఆహార భద్రత కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్‌ కనెక్షన్ల నంబర్‌ను దరఖాస్తుతో పాటు సమర్పించాలని వివరించింది. విద్యుత్‌ సిబ్బంది అర్హుల జాబితాలో వారి పేర్లను చేరుస్తారని వెల్లడించింది. అప్రూవల్ వచ్చాక నెక్స్ట్ మంత్ నుంచే ఫ్రీ కరెంట్ స్కీమ్ లో చేరవచ్చు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10