అమ్మన్యూస్, ప్రతినిధి: ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామాన్నికాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి సందర్శించారు. గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల తీరుపై ఆరాతీశారు. గ్రామస్తులతో కలిసి 5 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ పనులను పరిశీలించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతుండడం సంతోషకరమన్నారు. ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి సీతక్క సహకారంతో కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు 5 కోట్లకు పైగా నిధులు తీసుకురావడం హర్షనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజా పాలన సాగిస్తుందని అన్నారు. మరో రెండు గ్యారెంటీ హామీల పట్ల ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు.