AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబరు 6వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేశారు.

పోస్టుల వివరాలు..
11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, ఎల్పీ 727, పీఈటీ 182 . దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220లు, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకూ డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ANN TOP 10