AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కీలక నిర్ణయం.. ఓఆర్‌ఆర్ టెండర్లపై విచారణకు ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఓఆర్‌ఆర్ అవకతవలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ జాయింట్ కమీషనర్‌ ఆమ్రపాలిని ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ లీజు కాంట్రాక్టు కోసం గతంలో 4 సంస్థలు ముందుకు వచ్చాయి. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ. 8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హెచ్‌ఎండీఏ సంస్థ టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ)ని తీసుకువచ్చింది. గతేడాది కాలంగా దీనిపై కసరత్తు చేసిన హెచ్‌ఎండీఏ అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. ఇందులో రూ. వేల కోట్లలో చేతులు మారాయని ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

ANN TOP 10