షెడ్యూల్ విడుదల
మార్చి 28న పోలింగ్: ఈసీ
మహబూబ్‌గర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూలు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీకి మార్చి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు మార్చి 11 వరకు గడువు. నామినేషన్ల పరిశీలన మార్చి 12న, ఉపసంహరణకు 14వరకు గడువు. 2028 జనవరి 1వ తేదీ వరకు పదవీకాలం ఉన్న ఈ స్థానానికి మార్చి 28 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, కౌంటింగ్ ఏప్రిల్ 2వ తేదీన జరగనుంది. ఉపఎన్నిక ప్రక్రియ మొత్తం కోవిడ్-19 ప్రొటోకాల్స్ పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.