హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న బీజేపీ నేత కుమారుడు, అతడి ఇద్దరి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి డ్రగ్స్‌తో పాార్టీ ఏర్పాటు చేసినట్టు సమాచారం రావడంతో పోలీసులు.. ఆకస్మిక దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. వారి వద్ద కొకైన్ భారీ మొత్తంలో లభించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా, గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టార్ హోటల్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది.
పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు… డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నాయకుడి కుమారుడు ఉండటం గమనార్హం.









