అమ్మన్యూస్ స్టాఫ్ స్టాఫ్ రిపోర్టర్ పొన్నగంటి స్వామికి మంచి గుర్తింపు లభించింది. మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా కవరేజ్ కోసం అహర్నిశలు కష్టపడిన అమ్మ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పొన్నగంటి స్వామికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. పొన్నగంటి స్వామితో పాటు అమ్మ న్యూస్ బృందాన్ని శాలువాతో మంత్రి సీతక్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఎస్పీ శబరిష్ పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర బ్రహ్మాండంగా ముగిసింది. ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర.. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమై నిన్నటితో పరిసమాప్తమయ్యింది. చిలకల గట్టుకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ చేరుకోవడంతో మేడారం జాతర ముగిసింది.
