AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


కాగా, ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్‌కోట్‌లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు. కాగా, గుజరాత్‌లో నేడు సాయంత్రం జరిగే రోడ్ షోలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు.

ANN TOP 10