వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న కల్వర్టు దిమ్మెపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం కొంత వరకు దిమ్మెపైకి వెళ్లి ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు తాండూరు డిపోకు చెందినది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే బస్సు మేడారం జాతరకు వెళ్లి తాండూరు వెళ్తున్నట్లు తెలిసింది.
