AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతుబంధులో భారీగా అవినీతి.. వెలుగులోకి మరో మహిళా అధికారి బాగోతం

తెలంగాణలో ఒక్కో అవినీతి తిమింగలం బయటపడుతోంది. మొన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ, నిన్న ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి అక్రమాలు బయటపడగా.. ఇప్పుడు మరో మహిళా అధికారి బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. పథకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని హస్తం నేతలు ఆరోపిస్తూ వస్తుండగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో శాఖలోని అవినీతి బయటపడుతూ వస్తుండటం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ నిధుల గోల్ మాల్ జరిగిందని ఆరోపించగా.. కాగ్ రిపోర్ట్ కీలక విషయాలు వెల్లడించింది. ఇక.. గొర్రెల పంపిణీ పథకంలోనూ.. అక్రమాలు జరిగినట్టుగా కాగ్ నివేదిక కీలక విషయాలు బయటపెట్టింది.

ఈ క్రమంలోనే.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు బంధు పథకంలో కూడా అవినీతి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే.. రైతులు కాని వారికి, సాగులో లేని భూమికి, రియల్టర్లకు, ఎన్నారైలకు రైతుబంధు డబ్బులు ఇచ్చినట్టు తేలగా.. ఇప్పుడు అర్హులైన రైతులకు చెందాల్సిన డబ్బులను కొందరు అవినీతి అధికారులు నొక్కేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే.. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగేర ఏఈఓ దివ్య బాగోతం బయటపడింది.

ఏఈఓ దివ్య.. ఏకంగా 64 మంది అర్హులైన రైతులకు చెందాల్సిన పెట్టుబడి సాయాన్ని కాజేసినట్టు తేలింది. 64 మంది రైతులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలను.. వ్యవసాయ శాఖకు పంపకుండా వాటి స్థానంలో.. బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి.. ఆ డబ్బులు తనకు వచ్చేలా చేసుకుంది. ఇలా.. సుమారు రూ. 36 లక్షలు కాజేసింది. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10