సినీ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మౌనిక ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబంలోకి మరో బుజ్జాయి వస్తున్నాడంటూ గత డిసెంబర్ లోనే మౌనిక తన ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించింది. తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. తొలి భర్తతో మౌనికకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. కెరీర్ విషయాల్లోకి వస్తే కొత్త సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు మనోజ్ రెడీ అవుతున్నాడు. పిల్లల కోసం ఆట వస్తువులు, బొమ్మలు తయారు చేసి, విక్రయించే కంపెనీని మౌనిక ప్రారంభించింది.
