AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హిందూ సాంప్రదాయంలో కూడా షర్మిల కుమారుడి పెళ్లి

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన ప్రియా అట్లూరితో వివాహాన్ని జోథ్ పూర్‌లోని ఉమేద్ ఫ్యాలెస్‌లో అత్యద్బుతంగా జరిగింది. క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో ఇద్దరితో దైవ ప్రమాణం చేయించిన తర్వాత వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. రాజారెడ్డి, ప్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎదురుగా వధువరులు ఉంగరాలు మార్చుకున్నారు.

క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మాత్రమే కాక.. హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జరిగింది. అందులో తలంబ్రాల వేడుక సంబరంగా జరుపుకున్నారు. అలాగే విందు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కొత్త జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి జరిగిన వధువరుల జంట ప్రత్యేక ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. అలాగే వైఎస్ విజయమ్మ కూడా మనవడి వివాహవేడుకలో పాల్గొన్నారు.

రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్థం జనవరి 18న గండిపేటలోని గోల్కొండ రిసార్టులో జరిగింది. ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్ సిటిజెన్‌షిప్ కూడా ఉంది. రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇక షర్మిలతో తన కుమారుడు డాన్స్ కూడా ఆడిపించగా.. అలాగే షర్మిల తన కొడలికి నొదుటిపై ముద్దుపెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10