AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దక్షిణ కొరియా సరిహద్దులోని దీవిపై బాంబుల వర్షం కురిపించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు తత్వం, కవ్వింపు చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలోని ఓ దీవిపై ఉత్తర కొరియా బాంబుల వర్షం కురిపించింది.

ఇప్పటికే అణు ఆయుధాలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా… కొత్తగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. ఈ రాకెట్ లాంచర్ నుంచి 240 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ను దక్షిణ కొరియాకు దగ్గర్లోని ఓ దీవిపై ప్రయోగించింది.

ఈ రాకెట్ లాంచర్ పరీక్షలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ నిర్ధారించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నూతన ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో తాజా పరీక్ష కీలకమైనదని కేసీఎన్ఏ వివరించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10