AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అయ్యబాబోయ్ ఎలుకలు.. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‎ను ఎలుకలు కరిచాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‎లో చికిత్స పొందుతున్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పేషంట్ కాళ్లు, చేతుల భాగాలలో ఎలుకలు కరవడంతో తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. గమనించిన పేషంట్ కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.

ఎలుకలు సంచరించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మిగతా పేషెంట్లు.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అనంతరం పేషంట్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐసీయూ‎లోని పీఓపీ భాగం దెబ్బతినడంతో ఆ రంధ్రం గుండా ఎలుకలు సంచరిస్తున్నాయని తెలిపారు. అలా లోనికి వచ్చిన ఎలుకలు పేషెంట్లను కరుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా హాస్పిటల్ సిబ్బంది ఎలుకలను పట్టుకొని పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా వాటి నివారణా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ANN TOP 10