AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో ఒకే సీట్లో తండ్రీ కొడుకులు: అరుదైన సీన్‌

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఓ అరుదైన సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే సీట్లో కూర్చోవడం విశేషం. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఆయన తండ్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో ఒకే సీట్లో కూర్చున్నారు. కాగా దామోదర్రెడ్డి 5 సార్లు పోటీచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. కానీ ఆయన కొడుకు రాజేశ్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి చిరకాల కలను నెరవేర్చారు.

ANN TOP 10