AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేయమంటోంది

బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌ కీలక వ్యాఖ్యలు
అమ్మన్యూస్‌, హైదరాబాద్‌: ఎంపీగా పోటీపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తోందని… కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. హిందూ రాజ్యం స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. శాసనసభాపక్షనేత పదవిపై ఆసక్తి లేదన్నారు. ఎవరో ఒకర్ని.. ఫ్లోర్‌ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఫ్లోర్‌ లీడర్‌ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి.. బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్‌ లీడర్‌గా నియమించాలని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటోందన్నారు. బండి సంజయ్‌ కోసం కరీంనగర్‌ లోకసభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌ కూడా ప్రచారం చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ వెల్లడిరచారు.

ANN TOP 10