చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం గురించిన వివరాలను రాష్ట్రపతికి వికాస్ కుమార్ వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణించారు, ఎందుకు ప్రయాణించారు వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు.









