AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మళ్లీ సస్పెన్షన్!

ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు మరోసారి అనూహ్య పరిణామం ఎదురైంది. మూడో రోజు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అసెంబ్లీలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వమని, పంటల బీమా.. ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయింది.. దగా ప్రభుత్వం.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెడ్ లైన్ దాటి టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎక్కారు. ఈ నేపథ్యంలోనే ఈరోజుకి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే నిన్న కూడా ఒక రోజు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న టీడీపీ సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించగా మంగళవారం సస్పెండ్ చేశారు.

ANN TOP 10