ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సత్కారం
సీనియర్ జర్నలిస్ట్, భాషా కోవిదుడు, సౌమ్యశీలి, స్నేహశీలి, సాహిత్యంలో అపరమేధావి గడ్డం కృష్ణమూర్తికి అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు పత్రికా రంగంలో నాలుగు దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ‘తెలుగు భాషా రత్న జీవన సాఫల్య పురస్కారం’తో సత్కరించింది.
ఈ మేరకు సోమవారం ఆయన గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జీవన సాఫల్య పురస్కార అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎస్వీ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహా సంఘం మాజీ అధ్యక్షులు కొమ్మినేని శ్రీనివాస్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.