తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన కవిత స్పందించారు. సీఎం సోదరులు జిల్లాల రివ్యూల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పైన బండ్ల గణేష్ స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇంద్రెవెల్లిలో ప్రభుత్వ ఖర్చతో సభ ఏర్పాటు చేసి పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని కవిత ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యల పైన స్పందించిన బండ్ల గణేష్ పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడారా అని నిలదీసారు. జ్యోతీరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దన్నారు. సీఎం ప్రజల్లోకి వెళితే వాళ్లకు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా అంటూ నిలదీసారు. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ తెచ్చుకున్నారని మండి పడ్డారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాల్జేసారని బండ్ల గణేష్ మండిపడ్డారు.









