టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. ఆ మ్యాచ్‌లో బుమ్రా ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుపై విజృభించాడు. బుమ్రా ధాటికి ఇంగ్లాండ్ 136 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆరు వికెట్లతో సత్తాచాటిన బుమ్రా.. టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 34 మ్యాచ్‌ల్లోని బుమ్రా 150 వికెట్లు పడగొట్టాగలిగాడు. దీంతో టీమిండియా తరుపున టెస్టు క్రికెట్ అత్యంత తక్కువ మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన టాప్ ఫైవ్‌లోకి చేరుకున్నాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రెండో స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బుమ్రా, అనిల్ కుంబ్లే, ప్రసన్నలు ఉన్నారు. అలాగే అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన ప్లేయర్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. 6781 బంతుల్లోనే బుమ్రా ఆ మైయి రాయికి చేరుకున్నాడు.
ఇక విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను బౌలింగ్‌కు వచ్చింది. బ్యాట్ పట్టి మైదానంలోకి వచ్చిన టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. 290 బంతుల్లో 7 సిక్స్ లు, 19 ఫోర్లతో జైస్వాల్ (209) పరుగులు చేశాడు. అలాగే ఓపెనర్ రోహిత్ శర్మ (14) పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్‌పై 49 పరుగులు చేశారు. వారిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో గిల్ (34) పరుగులకు చేరుకున్న సమయంలో జెమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యార్ (27), రజత్ పటీదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17), రవిచంద్రన్ అశ్విన్ (20) పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 396 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లాండ్ ముందు పెట్టింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. మరోవైపు అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యే సమయానికి 253 పరుగులు చేసింది. టీమిండియా 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.









