రాష్ట్రంలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువు నేటితో ముగియనుండగా.. మరోసారి పొడిగింది. ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై తెలంగాణ పోలీసులు జరిమానాలు విధించారు. ఈ బకాయిలు చాలా రోజులుగా పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చలాన్లు క్లియర్ చేసుకునే వారికి రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే పెండింగ్ చలాన్లపై రాయితీ అవకాశాన్ని జనవరి 10 వరకు మాత్రమే కల్పించారు. ఆ తర్వాత వాహనదారుల నుంచి మంచి స్పందన రావడంతో గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పెండింగ్ చలాన్ల రాయితీకి గడువు పెంచింది.









