AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

తమిళనాడులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతూ డ్రైవర్ కునుకులోకి జారిపోవడంతో వాహనం అదుపుతప్పి సిమెంట్ ట్రక్క్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు దుర్మరణం చెందారు. సింగిలిపట్టి, పున్నయపురం మధ్య తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులను కార్తిక్, వేల్ మనోజ్, సుబ్రమణి, మనోహరన్, పోతిరాజ్‌లుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వారాంతపు విహారయాత్ర ముగించుకుని వారు కుట్రాళం నుంచి తిరిగొస్తుండగా ఈ ఘోరం జరిగింది

ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుమారు 3.30 గంటల సమయంలో కారు డ్రైవర్ కునుకులోకి జారుకోవడంతో కారు వేగంగా వెళ్లి సిమెంట్‌ లోడ్‌తో ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, ఫైర్, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10