AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంగారెడ్డిలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు

సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారి భూమి కంపించింది. జిల్లాలోని న్యాల్ కల్ మండలంలోని న్యాల్ కల్, ముంగి గ్రామాల్లో సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. భూ ప్రకంపనల సమయంలో.. వింత వింత శబ్దాలు వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందన్నది కాసేపటి వరకు ఏమీ అర్థం కాలేదని.. చాలా భయపడిపోయినట్టు వివరించారు. కాగా.. ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే… ఈ పరిణామంపై సంబంధిత శాఖ అధికారులు.. అధ్యయనం చేస్తున్నారు.

ఇటీవల జనవరి 11న ఆఫ్ఘనిస్థాన్‌లో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఇండియాలోని పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. పంజాబ్‌, చండీగఢ్‌, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీ- ఎన్సీఆర్‌ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

ANN TOP 10