AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాచకొండలో 25 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. మరో ఆరుగురు ఎస్‌ఐలు కూడా

హైదరాబాద్‌ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వులు జారీచేశారు. గతకొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పీఎస్‌ ఎస్‌హెచ్‌వోగా జీ.వెంకటేశ్వర్లును నియమించారు. బొమ్మలరామారం ఎస్‌గా ఉన్న జీ.శ్రీనివాస్‌ రెడ్డిని చైతన్యపురి పీఎస్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా హయత్‌నగర్‌ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లును మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

ANN TOP 10