AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం…న‌లుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 నెలల చిన్నారి సహా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని షాదాపా స‌మీపంలోని వీధి నంబర్ 26లోని ఓ ఇంటి కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ సంఘ‌ట‌న శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు మంటలు చెలరేగిన‌ట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పై అంతస్తుకు మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైట‌ పొగ అలుముకోవడంతో ఈ ప్ర‌మాదంలో ఊపిరాడక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిదినెల‌ల చిన్నారి స‌హా ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఓ బాలుడు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టమైన కారణం ఇంకా తెలియ‌లేదు. అగ్నిమాపక శాఖ అపస్మారక స్థితిలో ఉన్న ఇంటి నుండి కొంతమందిని జిటిబి ఆసుపత్రికి పంపారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు.

ANN TOP 10