AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెగాస్టార్ చిరంజీవి.. వెంకయ్యలకు పద్మ విభూషణ్

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది.

తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు-జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడులను పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతి మాల బాలి, బీహార్ రాష్ట్రం నుంచి బిందేశ్వర్ పాఠక్ (సాంఘిక సేవ), తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రమణ్యంలకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది. వీరితోపాటు పద్మ భూషణ్ అవార్డులను 17 మందికి, 110 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది. బిందేశ్వర్ పాఠక్‌ను మరణానంతరం పద్మ విభూషణ్, కేరళ మాజీ గవర్నర్ ఎం ఫాతిమా బీబీకి మరణానంతరం పద్మ భూషణ్ అవార్డు వరించింది.

పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన వారు వీరే
వైజయంతిమాల బాల -సినీ నటి- తమిళనాడు
కొణిదెల చిరంజీవి – సినీ నటుడు – ఆంధ్రప్రదేశ్
ఎం వెంకయ్య నాయుడు – రాజకీయాలు – ఆంధ్రప్రదేశ్
బిందేశ్వర్ పాఠక్ (ప్రజా సేవ) బీహార్
పద్మ సుబ్రమణ్యం -కళలు – తమిళనాడు

వీరికే పద్మ భూషణ్ పురస్కారం
ఎం ఫాతిమా బీబీ (ప్రజా సంబంధాలు)- కేరళ
హోర్ మున్షీజీ ఎన్ చామా (సాహిత్యం-విద్య)- మహారాష్ట్ర
మిథున్ చక్రవర్తి (కళలు) – పశ్చిమ బెంగాల్
సీతారాం జిందాల్ (వాణిజ్యం- పరిశ్రమ) – కర్ణాటక
యంగ్ లియూ (వాణిజ్యం, పరిశ్రమ) – తైవాన్
అశ్వినీ బాలాచంద్ మెహతా (వైద్యం) – మహారాష్ట్ర
సత్యబ్రత ముఖర్జీ ( ప్రజా సంబంధాలు) – పశ్చిమ బెంగాల్

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖులు వీరే
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన డీ ఉమామహేశ్వరి
తెలంగాణ నుంచి గడ్డం సమ్మయ్య
తెలంగాణ నుంచి దాసరి కొండప్ప
రాజస్థాన్ నుంచి జానకీలాల్‌ –
ఒడిశాకు చెందిన గోపీనాథ్‌ స్వైన్‌
త్రిపుర నుంచి స్మృతి రేఖ ఛక్మా
మధ్యప్రదేశ్ వాసి ఓంప్రకాశ్‌ శర్మ –
కేరళ నుంచి నారాయణన్‌ ఈపీ
ఒడిశా వాసి భాగబత్‌ పదాన్‌
ప‌శ్చిమ బెంగాల్ నివాసి సనాతన్‌ రుద్ర పాల్‌
త‌మిళ‌నాడు నుంచి భద్రప్పన్
సిక్కిం నుంచి జోర్డాన్ లెప్చ
మ‌ణిపూర్ వాసి మచిహన్‌ సాసా
బీహార్ నుంచి శాంతిదేవీ పాశ్వాన్‌, శివన్ పాశ్వాన్‌
ప‌శ్చిమ బెంగాల్ వాసి రతన్‌ కహార్
బీహార్ వాసి అశోక్‌ కుమార్‌ బిశ్వాస్
కేర‌ళ నివాసి బాలకృష్ణన్‌ సాధనమ్ పుథ్యా వితిల్
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసి బాబూ రామ్‌యాదవ్
ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన నేపాల్‌ చంద్ర సూత్రడార్
క‌ర్ణాట‌క నివాసి సోమన్న
అసోం వాసి పార్వ‌తి బారువా
ఛ‌త్తీస్ ఘ‌డ్‌కు చెందిన జగేశ్వర్‌ యాదవ్
జార్ఖండ్ వాసి ఛామి ముర్ము
హ‌ర్యానా నివాసి గుర్విందర్‌ సింగ్
ప‌శ్చిమ బెంగాల్ వాసి దుఖ్ మాజీ
మిజోరాం నివాసి సంగ్థ‌న్ కిమ
ఛ‌త్తీస్‌గ‌ఢ్ వైద్యుడు హేమచంద్‌ మాంజీ
గుజ‌రాత్ నుంచి యజ్డీ మాణెక్‌ షా ఇటాలియా
క‌ర్ణాట‌క వాసి ప్రేమ ధన్‌రాజ్
మ‌హారాష్ట్ర‌కు చెందిన ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి యనుంగ్ జ‌మొహ్‌ లెగో
అసోం నుంచి సర్వేశ్వర్‌ బాసుమత్రి
కేర‌ళ‌కు చెందిన సత్యనారాయణ బెలేరి
అండ‌మాన్ నికోబార్ నుంచి కే చెల్లామ్మాళ్

ANN TOP 10