ఆమోదముద్ర వేసిన గవర్నర్
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఖరారయ్యారు. టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా.. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ మాట ఇవ్వగా.. ఇప్పడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఆయన్న పెద్దలకు సభకు పంపుతున్నారు.
2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
ఇంతలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండు స్థానాలకు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తాజాగా ఆమోదించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ మద్దతును ప్రకటించారు. దీంతో కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.