AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. 5 రోజుల పాటు ఆ రూట్లలో ఆంక్షలు..!

హైదరాబాద్‌ వాసులకు పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. ఆయా మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ వీక్షించేందుకు.. క్రికెట్ అభిమానులు స్టేడియంకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకులను ఉదయం ఆరున్నరకే.. స్టేడియంలోపలికి అనుమతించనున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్‌సీఏ, పోలీసు శాఖ.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. అక్టోపస్ బలగాలతో పాటు మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంతేకాకుండా మఫ్టీలో మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

ANN TOP 10