AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన రెండు బస్సులు

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది. క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో చూస్తుండగానే రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండటం, మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్సులో షాక్‌ సర్క్యూట్‌ అవడం వల్లే మంటలు చెలరేగాయిన డిపో అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10