బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లుక్ మార్చేశారు. ఇన్ని రోజులు నీట్ షేవ్‌తో సాఫ్ట్‌గా కనిపించిన కేటీఆర్.. జుట్టు, గడ్డం పెంచేసి మాస్ సినిమాల్లో హీరోల్లా రఫ్ లుక్‌లో కనిపించారు. లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న ఫొటోనూ.. కేటీఆరే స్వయంగా ట్వీట్ చేశారు. నిన్నటి వరకు ఫార్మల్ లుక్‌లో కనిపించిన కేటీఆర్.. ఒక్కసారిగా అలా ఎలా అయిపోయారని అనుమానమా.. అయితే మొత్తం చదవాల్సిందే..
నీట్ షేవ్, ఫేయిర్ హెయిర్ కట్‌తో ఫార్మల్ లుక్‌లో కనిపించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఒక్కసారిగా మాస్ లుక్‌లో కనిపించారు. లాంగ్ హెయిర్, గడ్డంతో.. మాస్ హీరోను తలపించేంలా కేటీఆర్ కొత్త గెటప్ అదిరిపోయింది. ఈ కొత్త గెటప్‌లో ఉన్న ఫొటోను కేటీఆరే స్వయంగా ట్వీట్ చేయటం గమనార్హం. అయితే.. ఇది ఒరిజినల్ గెటప్ కాదండోయ్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని.. కేటీఆర్ లుక్‌ను మార్చేసిన ఓ ఫొటోను ఆయనకే పంపించాడట. ఈ ఫొటోలో.. కేటీఆర్‌కు పొడవాటి జట్టును, గడ్డంను కూడా పెట్టి.. మాస్ లుక్ వచ్చేలా ఎడిట్ చేశాడు. ఈ ఫొటోను చూసిన కేటీఆర్.. బాగా నచ్చటంతో దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు.
‘‘బీఆర్ఎస్ పార్టీని అమితంగా అభిమానించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫొటోను మీకోసం ట్వీట్ చేస్తున్నా. ఒకవేళ జుట్టు, గడ్డం పెంచుకుంటే అచ్చం ఇలా ఉంటానన్నమాట..’’ అంటూ సరదా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు కేటీఆర్. ఈ ఫొటోలో కేటీఆర్ ఓ మాస్ హీరోలా కనిపిస్తుండటంతో.. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేటీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు.









