AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్‌ లల్లా తొలి ఫొటో రిలీజ్‌.. నల్లటి పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు

ప్రాణప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయ గర్భగుడిలోకి చేరిన రామ్‌ లల్లా విగ్రహం తొలి ఫొటో తాజాగా విడుదలైంది. కళ్లకు గంతలతో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. నల్లటి ( కృష్ణశిల) పద్మపీఠంపై బాలరాముడు దర్శనిమచ్చాడు. ఈ రామ్‌ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి రూపొందించిన విషయం తెలిసిందే.

మరోవైపు నేడు అయోధ్యలో ఉత్తరప్రదేశ్‌ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్‌ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బాలరాముడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ప్రాణ ప్రతిష్ట ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.

అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు. కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్‌ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్‌ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ANN TOP 10