రాముడుతో రాజకీయాలు చేయడం బీజేపీ ఆపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. రాముడు అందరివాడని.. దేవుడి ఫొటోతో రాజకీయం చేయడం బీజేపీకి తగదన్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని తామెంత అన్నారు. రాముల వారి అక్షింతల పేరుతో కొంతమంది బియ్యం సంచులు ఇచ్చి అయోధ్య అక్షింతలుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు అహంకార పూరితంగా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దంటూ హైకోర్టులో పిల్ వేశారని.. ఒకవేళ వారు ఉచిత బస్ సౌకర్యం వద్దనుకుంటే టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.









