AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహాసిని నివాళులు..

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన ఘాట్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఘాట్ వద్ద నివాళి అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్..
తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌కు మరణం లేదని, ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని వివరించారు. పేదవారి ఆకలిని ఎన్టీఆర్ తీర్చారని గుర్తుచేశారు.

మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ కల్పించారని బాలకృష్ణ తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని పేర్కొన్నారు. కొందరు ఎన్టీఆర్‌ను దైవంగా చూస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం స్ఫూర్తిదాయకం అని వివరించారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో టీడీపీ కార్యక్రతలు నడవాలని బాలకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాం అని బాలకృష్ణ వెల్లడించారు.

ANN TOP 10