AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నేడు ప్రారంభం.. ఏ రోజున ఏం చేస్తారంటే..!

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి. 16వ తేదీ నుంచి 22వ తేదీ ఉదయం వరకు వారం రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఏ రోజున, ఏ కార్యక్రమం జరుగునుందనే అంశం ఉండనుందో తెలుసుకుందాం. పదండి.

16వ తేదీ- ప్రయాశ్చిత, కర్మకుటి పూజ
ఆలయ నిర్మాణ సమయంలో ఏదైనా తప్పు జరిగితే క్షమించాలని ఆ శ్రీరాముడిని వేద పండితులు కోరతారు. అయోధ్య బలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా బ్రాహ్మణులు దీక్ష స్వీకరిస్తారు.

17వ తేదీ- ఆలయ పరిసరాల్లోకి దేవుడి ప్రవేశం
రాములోరికి సమర్పించేందుకు సరయూ నది జలాన్ని భక్తులు మంగళ కలశంతో తీసుకొస్తారు. రామ్‌లల్లా విగ్రహాం అయోధ్యకు చేరుకుంటుంది.

18వ తేదీ- తీర్థ పూజ, జల యాత్ర
మండప ప్రవేశ పూజ నిర్వహిస్తారు. వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ చేస్తారు. దీంతో అధికారిక ఆచారాలు ప్రారంభం అవుతాయి.

19వ తేదీ- ధాన్యదివస్
ఆలయ ప్రాంగణంలో అగ్నిని వెలగిస్తారు. ఆ తర్వాత నవగ్రహ, యజ్ఞ గుండాన్ని ఏర్పాటు చేస్తారు.

20వ తేదీ- ఫలదివస్
రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నది నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

21వ తేదీ- పుష్పాదివస్
యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానోత్సవం అభిషేకం నిర్వహిస్తారు.

22వ తేదీ- ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. జనవరి 21, 22 తేదీలలో భక్తులను ఆలయంలోకి అనమతించరు. జనవరి 23వ తేదీన ఆలయం తెరుస్తారు.

100కి పైగా చార్టెడ్ విమానాల్లో అతిథులు అయోధ్యకు చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ANN TOP 10