AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు మకరజ్యోతి దర్శనం

హైదరాబాద్: హరిహర తనయుడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప కొలువైన క్షేత్రం శబరిమల. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. నియమ, నిష్టలతో మాల ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన తర్వాత కందమల శిఖరంపై దర్శనం ఇచ్చే మరకజ్యోతి కోసం ఎదురుచూస్తారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఉంటుంది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు చేరుకుంటున్నారు. 50 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చామని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. వాస్తవానికి 4 లక్షల మంది వరకు శబరిమలకు చేరుకుంటారని తెలుస్తుంది.

హైదరాబాద్‌లో హస్తినాపురం డివిజన్ సాగర్ రింగ్ రోడ్డులో గల హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నెయ్యి అభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు మకర జ్యోతి దర్శనం, మహా హారతి ఉంటాయని పాలక మండి చైర్మన్, కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.

ANN TOP 10