AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి వెళుతున్నాను… రాజకీయ పర్యటన మాత్రం కాదు: గవర్నర్ తమిళిసై

తాను ఢిల్లీ పర్యటనకు వెళుతున్నానని… అయితే ఇది రాజకీయ పర్యటన కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సంక్రాంతి పండుగ కోసం తాను దేశ రాజధానికి వెళుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు… రాజ్ భవన్‌లో నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ఈ ఏడాది ప్రత్యేకత అని గుర్తు చేశారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీ భాషలలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ANN TOP 10