AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

21 మంది ఇన్‌చార్జులతో వైసీపీ మూడో జాబితా విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే.. పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వైసీపీ ఇంఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు. ఈ సారి 21 స్థానాల్లో కొత్త ఇంఛార్జులను నియమించారు జగన్. మూడో జాబితాను బుధవారం (జనవరి 10న) రోజునే ప్రకటించాల్సి ఉండగా.. కొందరి విషయంలో స్పష్టత రాకపోవటంతో ఈరోజుకు వాయిదా పడింది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సుదీర్ఘంగా చర్చించి.. జాబితాను ఫైనల్ చేశారు. ఈజాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంఛార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంఛార్జులుగా అవకాశం కల్పించారు వైెఎస్ జగన్. అయితే.. ఇప్పుడు ప్రకటించే ఇంఛార్జులే.. ఎన్నికల్లో ఆయా నియోజవర్గాల్లో అభ్యర్థులుగా నిలువనుండగా.. ఈ జాబితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ జాబితాల్లో కొందరు సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించగా.. కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు.

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..
ఇచ్చాపురం- పిరియ విజయ
టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి- కంభం విజయ రాజు
రాయదుర్గం- మెట్టు గోవింద రెడ్డి
దర్శి- శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు- సునీల్ కుమార్
చిత్తూరు- విజయానందరెడ్డి
మదనపల్లె- నిస్సార్ అహ్మద్
రాజంపేట- ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
ఆలూరు- విరూపాక్షి
కోడుమూరు- డాక్టర్ సతీష్
గూడురు- మేరిగ మురళి
సత్యవేడు- మద్దిల గురుమూర్తి
పెనమలూరు- జోగి రమేష్
పెడన- ఉప్పాల రాము
ఎంపీ అభ్యర్థులు వీళ్లే..

విశాఖపట్నం- బొత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ- కేశినేని నాని
తిరుపతి- కోనేటి ఆదిమూలం
కర్నూలు- గుమ్మనూరి జయరాం
శ్రీకాకుళం- పేరాడ తిలక్

ANN TOP 10