కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బుధవారం బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. తనయుడి పెళ్లి నేపథ్యంలో షర్మిల కొన్ని రోజులుగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులను కలుస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం హరీశ్ రావు నివాసానికి వెళ్లి పత్రికను అందించారు. తన తనయుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని కోరారు. హరీశ్ రావుకు పత్రికను అందిస్తోన్న ఫొటోను షర్మిల తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా కొడుకు పెళ్లికి ఆహ్వానించానని పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులను కలిసి ఇప్పటికే ఆహ్వానించారు. ఈ నెల 18న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి జరగనున్నాయి.