AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ పడిపోయిన అదానీ.. 4 రోజుల్లోనే సీన్ రివర్స్.. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీ!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి భారత్ సహా ఆసియాలో అత్యంత కుబేరుడిగా నిలిచారు. చాలా రోజుల తర్వాత అంబానీని అధిగమించి ఇటీవల అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మొదటి స్థానానికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పడిపోయారు. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నష్టపోయిన క్రమంలో అదానీ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. దీంతో మళ్లీ అంబానీ పుంజుకున్నారు. ప్రస్తుతం బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేశ్ అంబానీ 96.6 బిలియన్ డాలర్ల సంపదతో (భారత కరెన్సీలో రూ. 8 లక్షల కోట్లకుపైనే) ప్రపంచంలోనే 12వ స్థానంలో ఉన్నారు. భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

ఇక గౌతమ్ అదానీ సంపద ప్రస్తుతం 95 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 7.8 లక్షల కోట్లకుపైనే ఉంది. ఇదే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ చూస్తే అంబానీ 102.5 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో, 79.8 బిలియన్ డాలర్లతో అదానీ 16వ స్థానంలో ఉన్నారు.

గతేడాది అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ కారణాలతో అదానీ గ్రూప్‌కు చెందిన చాలా స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. దాదాపు సగానికిపైగా అదానీ సంపద పతనమైంది. మార్కెట్ క్యాప్ 150 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయింది. తదనంతరం.. దీనిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరుపుతోంది.

ANN TOP 10