AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదు

బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (CPI Leader Chada Venkatreddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరాముడు మంచివాడే కాదని ఎవరు కూడా అనరని.. రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్‌ను ఓడించిందని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించడం చాలా మంచి పరిణామమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ANN TOP 10