AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గజగజ వణుకుతున్న ఉత్తరభారతం.. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న ప్రజలు

ఉత్తరభారతాన్ని చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికితోడు ఆయా రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పగలు కూడా రాత్రి వాతావరణాన్ని తలపిస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత 50 మీటర్లుగా ఉంది. రాజస్థాన్‌, బీహార్‌, హర్యానా, చండీగఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశాలో విజిబిలిటీ 50 నుంచి 200 మీటర్లుగా ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

ఇక దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సఫ్ధార్‌జంగ్‌ అబ్జర్వేటరీలో 6.9 డిగ్రీల సెల్సియస్‌, లోధి రోడ్డులో 6.4 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ANN TOP 10