కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తంకు.. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.. కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు అందాయి. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్దఎత్తునే దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన నిర్వహిస్తోంది. దీని కోసం ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేకుండా.. ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు.. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు.
సెప్టెంబర్ 28 నుంచి ఆరు గ్యారంటీల ప్రోగ్రాంలో భాగంగా.. లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈక్రమంలోనే… ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తుకు భారీగా స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు పోటెత్తాయి. ప్రజాపాలన దరఖాస్తులతో పాటు.. చాలా మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా.. కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు అందాయి. గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పెద్దఎత్తునే దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు.









