AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎట్టకేలకు డేట్‌ ఫిక్స్‌..

వివాహ బంధంతో ఒక్కటవుతున్న విజయ్, రష్మిక..

నటుడు విజయ్‌ దేవరకొండ తన ఫ్రెండ్, నటి రష్మికతో త్వరలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్, రష్మికల మధ్య ఎప్పటి నుంచో ఏదో ఉందని.. ఓ టాక్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ గీత గోవిందం అనే సినిమా నుంచి మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఈ సినిమా హిట్‌ తర్వాత ఈ కాంబినేషన్‌లో డియర్‌ కామ్రెడ్‌ వచ్చింది. ఇదిలా ఉంటే.. రష్మిక దాదాపుగా ప్రతి పండుగకు విజయ్‌ ఇంటికి వస్తుందని సోషల్‌ మీడియా టాక్‌. అంతేకాదు ఈ జంట ఆ మధ్య వెకేషన్‌ కోసం మాల్దీవ్స్‌కు వెళ్లినట్లు రూమర్స్‌ వినిపించాయి. ఇక లేటెస్ట్‌గా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం వీరి ఈవెంట్‌ ఫిబ్రవరిలో సెకండ్‌ వీక్‌లో ఉండనుందని అంటున్నారు.

ANN TOP 10