AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్ చరణ్ సినిమాకి రెహమాన్ సంగీతం… సినిమా అప్డేట్‌తో స్పెషల్ పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ కొట్టి.. జాతీయ అవార్డును గెలుచుకున్న యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేతులు కలిపారు. ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో వచ్చే క్రేజీ సినిమా RC16 టెక్నికల్ స్టాండర్డ్స్ పరంగా అత్యున్నతంగా ఉండబోతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఇవ్వబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పుట్టిన రోజు (జనవరి 6) సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్ వేశాడు. దీంతో రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లోకి రెహమాన్ వచ్చినట్టు అధికారికంగా ప్రకటించేసినట్టు అయింది.

హ్యాపీ బర్త్ డే సర్ అంటూ రెహమాన్‌కు రామ్ చరణ్ విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు రెహమాన్‌ను ఆర్‌సీ 16 నిర్మాతలు ప్రత్యేకంగా కలిశారు. రెహమాన్‌కు స్పెషల్‌గా విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. సుకుమార్, బుచ్చిబాబు, రెహమాన్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


రామ్ చరణ్‌తో బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ శివన్న కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నాడట. జైలర్ తరువాత శివన్న స్పెషల్ అప్పియరెన్స్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. బుచ్చిబాబు పాన్ ఇండియన్ ప్రాజెక్టు‌గా తెరకెక్కిస్తున్న ఈ మూవీతో చాలా కాలం తరువాత రెహమాన్ ఓ తెలుగు సినిమాకు మ్యూజిక్ కొడుతున్నట్టు అవుతోంది. కొమురం పులి తరువాత మళ్లీ రెహమాన్ తెలుగు సినిమాకు పని చేయలేదని తెలుస్తోంది. మహేష్ బాబు నాని, పవన్ కళ్యాణ్ కొమురం పులి తరువాత ఇప్పుడు రెహమాన్ మళ్లీ బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తున్నట్టు అవుతోంది.

రెహమాన్ బర్త్ డే సందర్భంగా ఇలా RC 16 నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇలా అయినా కూడా రామ్ చరణ్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఎంత త్వరగా పూర్తి చేస్తే.. అంత త్వరగా కంప్లీట్ చేసి బుచ్చిబాబుతో కలిసి సెట్స్ మీదకు వెళ్లేందుకు రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడు.

ANN TOP 10