AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో టీమ్ఇండియాను వెన‌క్కినెట్టిన ఆసీస్‌

భార‌త్‌కు ఆస్ట్రేలియా గండం ప‌ట్టుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌తో పాటు, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచుల్లో టీమ్ఇండియాను ఓడించి క‌ప్పుల‌ను గెలుచుకున్న ఆసీస్ తాజాగా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో భార‌త్‌కు డ‌బుల్ షాక్‌లు ఇచ్చింది. టీమ్ఇండియాను వెన‌క్కి నెట్టి నిన్న టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరిన‌ ఆస్ట్రేలియా నేడు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానానికి చేరుకుంది

సిడ్నీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్లీప్ చేయ‌డంతో పాటు డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానం నుంచి మొద‌టి స్థానానికి దూసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో ఆస్ట్రేలియా 8 టెస్టులు ఆడింది. ఐదు మ్యాచుల్లో గెల‌వ‌గా రెండు మ్యాచుల్లో ఓడింది. మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ప్ర‌స్తుతం ఆసీస్ ఖాతాలో 54 పాయింట్లు ఉన్నాయి. 56.25 విజ‌యశాతంతో అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.

ANN TOP 10