జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నాయకుడిపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు (45) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు. రాములు మృతి పట్ల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









